ఎల్ఎల్ఎం పరీక్షలో కాపీ కొట్టిన ఐజి: డిబార్?

కొట్టాయం: అవినీతి, అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత గల ఓ పోలీసు ఉన్నతాధికారే పరీక్షలో చూచిరాతకు పాల్పడ్డారు. సాక్షాత్తు ఐజీ హోదాలో ఉన్న టిజె జోస్‌ అనే అధికారి.. కేరళలో జరిగిన ఎల్‌ఎల్‌ఎం పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డట్టు నిర్ధారణ అయ్యింది.

ఇక్కడి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి చెందిన ఉపసంఘం ఒకటి ఈ మేరకు తేల్చింది. మంగళవారం తన నివేదికను ప్రో ఉపకులపతి షీనా షకూర్‌కు కమిటీ సమర్పించింది.

Inspector General of Police Tried to Copy During LLM Exam: MGU Panel

'ఇన్విజిలేటర్లు, విద్యార్థుల నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం.. ఐజీ టిజె జోస్‌ చూచిరాతకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది' అని కమిటీలోని సభ్యుడొకరు తెలిపారు. ఈ ఏడాది మే 4న కలామెస్సరీలోని సెయింట్‌ పాల్స్‌ కళాశాలలో ఈ పరీక్ష జరిగింది.

కమిటీ నివేదిక ఆధారంగా యూనివర్సిటీ పాలక మండలి తన తదుపరి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనుంది. మూడేళ్ల పాటు పరీక్ష రాయకుండా ఆయనను డిబార్‌ చేసే అవకాశం ఉంది. ఐజీపై శాఖపరమైన విచారణ కూడా జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+