జూ.ఎన్టీఆర్-బాలకృష్ణ మధ్య ప్యాచప్: సారీ చెప్పారా?
హైదరాబాద్: గత కొన్నేళ్లుగా హీరో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది! తాజాగా, అబ్బాయి... బాబాయ్‌తో స్నేహపూర్వకంగా మెలిగేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఇటీవలి వరకు స్పెయిన్‌లో ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చారు.
హైదరాబాద్ తిరిగి వచ్చాక జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేశారని వార్తలు వస్తున్నాయి. కొద్దిసేపు మాట్లాడారని చెబుతున్నారు. దీనిపై సినిమా పరిశ్రమలోను ఆసక్తికర చర్చ సాగుతోందని అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టెటర్ సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇద్దరి సినిమాలు దాదాపు ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్నాయి. పైగా, ఇరువురి మధ్య గ్యాప్ ఉంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కల్పించుకొని ఫోన్ చేశారని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్‌కు బాలకృష్ణ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇద్దరి సినిమాలు ఒకే సమయంలో కాకుండా... బాబాయ్, అబ్బాయ్‌లలో ఒకరి సినిమా వారం పది రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే, బాలకృష్ణ నిర్ణయంపైన అంతా ఆధారపడి ఉందని చెబుతున్నారు. ఇరువురి మధ్య ఓ సీనియర్ రాజకీయ నాయకుడు సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారని అంటున్నారు.
అతని వల్లే జూనియర్.. బాబాయ్‌కు ఫోన్ చేశారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసింది.. మరో సీనియర్ నటుడి నుంచి అని చెబుతున్నారు. అంతేకాదు, కొన్నేళ్లుగా ఉన్న విభేదాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్... బాలయ్యకు సారీ కూడా చెప్పారట!
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications