కలాం హెయిర్ స్టైల్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!
చెన్నై: చిన్న పిల్లలను తలపించే కల్మషం లేని చిరునవ్వుతో ఎప్పుడూ కనిపించే అబ్దుల్ కలాంను చూడగానే.. ముందుగా ఆయన హెయిర్ స్టైల్ మనల్ని ఆకట్టుకుంటుంది. అబ్దుల్ కలాం పేరు చెప్పగానే రాష్ట్రపతి, ఒక శాస్త్రవేత్తగా భారత క్షిపణి వ్యవస్థకు అందించిన సేవలు మదిలో మదిలో మెదిలినా.. ఆయన్ని చూస్తే మాత్రం మన దృష్టి ఆయన తొలుత జుట్టుపైనే పడుతుంది.
దేశాధినేతలైనా, ప్రముఖ శాస్త్రవేత్తలైనా, విద్యార్థులైనా, ప్రజలైనా ఆయన హెయిర్ స్టైల్ చూడగానే కొత్త అనుభూతిని పొందుతారు. అయితే కలాం హెయిర్ స్టైల్ వెనుక ఓ కథ కూడా ఉంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న సొంత ఊరిలో ఆయన పూర్వీకులంతా ఇలాగే కొంత పొడవైన జుట్టును పెంచుకునేవారట.

అదే విధానాన్ని కలాం కూడా కొనసాగించారు. జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నప్పుడు కూడా ఆయన తన హెయిర్ స్టైల్ మార్చుకోలేదు. ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ అంటే కలాంకు ఎంతో ఇష్టం. అందుకే, వెంట్రుకులను ఆ స్టైల్‌లో ఉంచుకోవడానికి మాత్రం కలాం ప్రత్యేక శ్రద్ధే పెట్టేవారు. తరచూ తల దువ్వుకుంటూ ఉండేవారు.
కలాం హెయిర్‌స్టైల్ అలా తీర్చిదిద్దడం వెనుక ఢిల్లీలోని హబీబ్ కుటుంబీకుల పాత్రా ఉంది. వీరు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్న సెలూన్‌లో కలాం కటింగ్ చేయించుకునేవారు. ఇందుకుగానూ... కలాం వద్ద నుంచి రూ.500 తీసుకునేవారట.












Click it and Unblock the Notifications