ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు కెసిఆర్ ఫోన్: ఆహ్వానం
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చాలా కాలంగా భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఆగ్రహాన్ని పక్కన పెట్టి ఆయన ఆయుత చండీయాగానికి రాధాకృష్ణను ఆహ్వానించారు. కెసిఆర్ స్వయంగా రాధాకృష్ణకు ఫోన్ చేసి ఆహ్వానం పలికారు.
యాగం విశేషాలను తెలియజేస్తూ - సతీసమేతంగా రావాలని కెసిఆర్ రాధాకృష్ణను కోరారు. మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లిలో గల తన ఫామ్ హౌస్‌లో కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ఆయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయుత చండీ మహాయాగానికి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. మెదక్ జిల్లా ఎర్రవల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో యాగం కోసం ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే యాగం ఏర్పాట్లను గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దంపతులు పరిశీలించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్వహించతలపెట్టిన అయుత చండీ మహాయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్లు నరసింహన్, రోశయ్య, విద్యాసాగర్‌రావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications