బెజవాడలో స్మోక్ చేస్తూ చిక్కిన కెసిఆర్! (ఫోటో)
బెజవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పొగ తాగాడంటూ ఓ ఫోటో, వీడియో సామాజిక ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది. కెసిఆర్ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బెజవాడలో ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
తాను నిర్వహిస్తున్న చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. కెసిఆర్‌తో పాటు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు ఉన్నారు. ఈ సమయంలో... హెలిప్యాడ్ వద్ద కెసిఆర్ పొగ తాగారంటూ ఓ ఫోటో హల్ చల్ చేసింది.
Video credits: todaynews9
ఇది సోషల్ మీడియాలో సోమవారం నాడు చాలామంది చూశారు. అరగంటలో వందలాది మంది చూశారు. ఆ తర్వాత అందుకు సంబంధించిన వీడియోను తొలగించారని అంటున్నారు. కెసిఆర్ పొగ తాగిన సమయంలో యనమల పక్కనే ఉన్నట్లుగా ఫోటోలో ఉంది. యనమలతో మాట్లాడుతూ... కెసిఆర్ స్మోక్ చేస్తున్నట్లుగా ఉంది. కెసిఆర్ స్మోక్ చేస్తున్నట్లుగా ఉన్న ఫోటో పక్కన ఓ ఫైరింజన్ కూడా ఉంది.
కాగా, సోమవారం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసిన కెసిఆర్ చండీయాగానికి ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా వారి మధ్య విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల అభివృద్ధి పైన మాట్లాడుకున్నారు. వారి మధ్య ఆసక్తికర చర్య కూడా జరిగింది.

అప్పట్లో మీరు యాగాలు చేయలేదు కదా అని చంద్రబాబు అడగ్గా, లేదు చేశానని కెసిఆర్ చెప్పారు. కెసిఆర్ కూడా మాట్లాడుతూ.. అన్నా! నేను హెలికాప్టర్లో వస్తూ చూశాను.. మీ ఇంటి వద్ద నదిలో నీళ్లు నిండుగా ఉన్నట్లుగా అనిపించిందని, ఇప్పుడే ఇలా ఉంటే వరదలొస్తే మీ ఇల్లు మునగదా అని ప్రశ్నించారు.
దానికి చంద్రబాబు స్పందిస్తూ.. ఇబ్బంది ఏమీ ఉండదని, వీటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం నదిలో ఆ నీటిమట్టం నిర్వహిస్తుంటారని, లేకపోతే వీటీపీఎస్ ఆగిపోతుందని, రాజధాని ప్రాంతానికి కూడా ఇబ్బంది లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications