పాక్‌తో పరిష్కారానికి 2గంటలు, ఏపీ-టీ పరిష్కారానికి 2 రోజులు!
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల పంపిణీ పైన తలెత్తిన వివాదాలను అతి తక్కువ వ్యవధిలో పరిష్కరించిన ఖుష్ వోహ్రాకు సమర్థ అధికారిగా పేరుంది. అతనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జల వివాదాన్ని సమస్యను పరిష్కరించారు.
సమర్థ అధికారిగా పేరున్న ఆయనకు కేంద్రం తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న కృష్ణా జల వివాదాల పరిష్కార బాధ్యతను అఫ్పగించింది. ఇరు రాష్ట్రాల మధ్య ఒక అవగాహన కుదిరేందుకు కారణం ఎక్కువగా వోహ్రానే అని చెబుతున్నారు.

కాగా, సింధు జలాల పంపిణీ విధానాన్ని భారత్, పాకిస్తాన్ మధ్య పరిష్కరించేందుకు వారికి రెండు గంటలు పట్టిందట. అదే కృష్ణా జలాల పైన తెలంగాణ, ఏపీ మధ్య తలెత్తిన వివాదం పరిష్కారానికి రెండు రోజుల సమయం పట్టిందని చెప్పారని అంటున్నారు.












Click it and Unblock the Notifications