హల్‌చల్: ఎంపి మల్లారెడ్డి గాంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ (వీడియో)
హైదరాబాద్: మల్కాజిగిరి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి విద్యార్థులను ఉర్రూతలూగించారు. వైద్య, ఇంజనీరింగ్ కాలేజీల యజమాని కూడా అయిన మల్లారెడ్డి విద్యార్థులతో కిటకిటలాడుతున్న సభలో వేదికపై గాంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేసి సంచలనం సృష్టించారు.
ఆయన గాంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 56 ఏళ్ల పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి దాదాపు ఐదు నిమిషాల పాటు ఓ పాటకు స్టెప్పులేస్తూ విద్యార్థులను మురిపించారు.
మల్లారెడ్డి అంతకు ముందు విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా సోషల్ మీడియాలో నేను మల్లారెడ్డిని అనే పేరుతో ప్రసారమైంది. ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయిన తాను ఇంత ఎత్తుకు ఎలా ఎదిగిందీ ఆయన విద్యార్థులకు వివరించారు. తాను పార్లమెంటు సభ్యుడిగా ఎలా అయిందీ చెప్పారు.
సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వార్షికోత్సవంలో ఆయన గాంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేశారు. ఆయన ఇటీవలి ఎన్నికల్లో మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications