జంబలకిడి పంబ: వద్దన్నా ఎత్తుకెళ్లి తాళి కట్టించుకుంది

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. జంబలకిడి పంబ సినిమా సన్నివేశాన్ని పోలిన సంఘటన జరిగింది. ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. అతను వద్దని చెప్పడంతో.. బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

కర్నాటకలోని బెళగావి జిల్లాలోని రాయబాగ్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగి అయిన నారాయణప్పను అదే సంస్థలో పని చేసే ప్రతిభ అనే యువతి ప్రేమించింది. అది వన్ సైడ్ ప్రేమ. అతనినే వివాహం చేసుకోవాలని అనుకుంది. ఇదే విషయాన్ని అతనిని అడిగింది.

Man claims forcibly marriage

ప్రతిభ విజ్ఞప్తిని నారాయణప్ప తిరస్కరించాడు. దీంతో, ఆమె హతమారుస్తానని అతనిని బెదిరించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం నారాయణప్పను ఎత్తుకెళ్లింది. జోడప్ప గ్రామంలోని ఆలయంలో బలవంతంగా తాళి కట్టించుకుంది.

దానిని వీడియో తీయించింది. వద్దని అంటే వీడియోను బహిర్గతం చేసి తనను మోసం చేశావంటూ కేసు పెడతానని బెదిరించింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నారాయణప్ప పోలీసులను ఆశ్రయించాడు. అయితే, పోలీసులు నిజానిజాలను వెలుగుతీసే పనిలో పడ్డారు. అమ్మాయే బలవంతంగా తాళి కట్టించుకుందా, లేక ఇతని నుంచి ఏమైనా తప్పు ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+