దంత వైద్యం వికటించి గజనీగా మార్చేసింది

లండన్: హాలీవుడ్ చిత్రాలు గ్రౌండ్‌హాగ్ డే, మెమెంటో చిత్రాలను, దక్షిణాది చిత్రం గజనీని గుర్తుకు తెచ్చే విధంగా లండన్‌లో ఓ వ్యక్తికి కేవలం 90 నిమిషాలు మాత్రమే జ్ఞాపకశక్తి ఉంటోంది. ఈ విషయాన్ని భారతీయుడితో కూడిన పరిశోధకుల బృందం తెలిపింది.

ఈ బాధితుడి వ్యవహారం పై లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ గెరాల్డ్ బుర్గెస్ బృందం పరిశోధనలు చేసింది. నార్త్‌హాంప్‌షైర్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌లో సైక్రియాటిస్ట్‌గా సేవలందిస్తున్న భాను చదలవాడ ఈ బృందంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Man Develops Anterograde Amnesia After Dental Appointment

దశాబ్దకాలం క్రితం పంటి నొప్పితో బాధపడుతున్న ఆయన ఓ దంతవైద్యుడిని సంప్రదించారు. దంతవైద్యుడు చేసిన రూట్ కెనాల్ చికిత్స వికటించి జ్ఞాపకశక్తి క్షీణతకు దారితీసిందని బర్గేస్ చెప్పారు.

విలియం అనే బాధితుడు జ్ఞాపక శక్తి క్షీణతతో బాధపడుతున్నాడు. దాన్ని ఆంటిరోగ్రేడ్ అమ్నేషియా అంటారు. ఈ వ్యాధికి గురైనవాళ్లు జ్ఞాపకం ఉంచుకోవడంలోనూ, కొత్త సమాచారాన్ని స్వీకరించడంలోనూ ఇబ్బందులకు గురవుతారు. మెదడులో స్ట్రక్చరల్ డ్యామేజీ వల్ల ఇది సంభవిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+