నమో నారాయణ!: చిక్కుల్లో మంత్రి నారాయణ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో చక్రం తిప్పుతున్న నారాయణ చిక్కుల్లో పడబోతున్నారు. గతంలో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసును ప్రోబ్ అనే సంస్థ తాజాగా తవ్వి తీస్తోంది. వాటిని ప్రస్తావిస్తూ ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ప్రోబ్ ఫిర్యాదు ప్రకారం - 2010లో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి, పుస్తకాలు ప్రింటుచేసి, అమ్మినందుకు తెలుగు అకాడమీ హైదరాబాద్ నారాయణగూడ పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌నెంబర్ 356తో అప్పటి నారాయణ విద్యా సంస్థల అధిపతిగా ఉన్న పి. నారాయణపై క్రిమినల్ కేసు నమోదుచేసింది. ఐదు కీలకమైన పాఠ్య విభాగాలకు సంబంధించి పంపిణీ, ముద్రణ బాధ్యతలను ఇంటర్‌బోర్డు, ప్రభుత్వం తెలుగు అకాడమికి అప్పగించింది. ఆ ప్రకారంగా కాపీరైట్ హక్కులన్నీ అకాడమీకే చెందుతాయి.

అయితే, నారాయణ విద్యాసంస్థల అధిపతిగా ఉన్న ఇప్పటి మంత్రి నారాయణ దానిని ఉల్లంఘించి, ఆయన ఎండీగా ఉన్న నైమిష మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్, తెలుగు అకాడమీకి చెందిన స్టడీ మెటీరియల్‌ను అక్రమంగా మళ్లీ ముద్రించి అమ్ముకుంది. ఇది ఇండియన్ కాపీరైట్-1957 చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని ప్రోబ్ సంస్ధ తాజాగా ఎన్నికల సంఘానికి వివరించింది.

Minister Narayana in trouble with Probe complaint

నారాయణ విద్యాసంస్థల యాజమాన్యంపై అకాడమీ అధికారుల ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రకారంగా ఇప్పటి మంత్రి అయిన నాటి నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ, పి. దేవి, పి.సింధూరను ఏ1,ఏ2,ఏ3లుగా కేసులు నమోదు చేశారు. నారాయణగూడ పోలీసుస్టేషన్‌లో ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. కోర్టు నుంచి ఎలాంటి వెసులుబాటు, ఊరట లభించలేదని ఫిర్యాదుదారు అంటున్నారు

కాగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గవర్నర్ కోటా అభ్యర్ధిగా నారాయణ నామినేషన్ దాఖలు చేసినప్పుడు, ఈ వాస్తవాలను తన అఫిడవిట్‌లో పేర్కొన కుండా మోసం చేశారని ప్రోబ్ సంస్థ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఇది ఎన్నికల సంఘాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడమే కాకుండా, ఎన్నికల నిబంధనలను కావాలని ఉల్లంఘించడమేనని అంటూ అందుకు ఆయనను అనర్హుడిగా ప్రక టించాలని కోరుతూ ప్రోబ్ సంస్థ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్ధి అయినా, తన నేరచరిత్ర గురించి ఫారం -26లో పేర్కొ నాలని ఎన్నికల నిబంధన స్పష్టం చేస్తోంది. అలా కాదని తమ నేరాలను దాచిపెట్టినట్టయితే, సదరు అభ్యర్థి ఒకవేళ గెలిచినా తర్వాత అతనిపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఇప్పుడు నారాయణ తనపై ఉన్న క్రిమినల్ కేసును దాచిపెట్టడం వివాదంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+