ఆర్టీసీ బస్సు నడిపిన కోతి: చెమటలు పట్టించింది

బరేలి: ఉత్తర్ ప్రదేశ్ లో ఓ కోతి ఆర్టీసీ బస్సు నడిపి డ్రైవర్ కు చుక్కలు చూపించింది. ఇంజిన్ స్టార్ట్ చెయ్యడమే కాకుండా సెకండ్ గేర్ వేసి ముందుకు దూసుకు వెళ్లింది. అడ్డుకోవడానికి వెళ్లిన బస్సు డ్రైవర్ పై దాడి చెయ్యడానికి ప్రయత్నించింది.

వివరాల్లోకి వెళితే - ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) బస్సు ఫిలిబిత్ నుంచి బరేలీకి వెళ్లింది. తిరిగి ఫిలిబిత్ బయలుదేరవలసి ఉంది. సమయం ఉండటంతో బస్సు డ్రైవర్ ఇంజిన్ ఆఫ్ చేసి చివరి సీటులోకి వెళ్లి కునుకుతీశాడు.

కండెక్టర్ బస్సు కింద నిలబడి ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ఓ కోతి బస్సులోకి ఎక్కింది. ఒక్క సారిగా ఇంజిన్ స్టార్ట్ చేసింది. ఉలిక్కిపడిన డ్రైవర్ తన సీటు దగ్గరకు పరుగు తీశాడు.

Monkey starts engine, drives bus at station in Uttar Pradesh

అంతే కోతి డ్రైవర్ ను బెదిరిస్తూ మీద పడి దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. డ్రైవర్ కోతిని బయటకు పంపించడానికి ప్రయత్నించాడు. అయితే కోతి సెకండ్ గేర్ వేసి కిందకు దూకేసింది. డ్రైవర్ తన సీటులో కూర్చుని బస్సును నియంత్రించడానికి ప్రయత్నించాడు.

అయితే అప్పటికే బస్సు ముందు నిలిపి ఉన్న రెండు బస్సులను డీకొంది. ఈ ప్రమాదంలో పెద్ద నష్టం జరగలేదని ఆర్టీసీ అధికారులు చెప్పారు. కోతి బస్ స్టాండ్ లో చేసిన హంగామాకు ఆ డ్రైవర్ తో పాటు కొందరు ప్రయాణికులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+