బంగ్లా పర్యటన: ఒకే గదిలో ధోని, కోహ్లీ..!
ఫతుల్లా: టెస్టు క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలకడంతో పుల్ టైమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టాడు. వేర్వేరు ఫార్మెట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉండటం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. టీమిండియా విదేశీ పర్యటనలో ప్రొటోకాల్ ప్రకారం భారత కెప్టెన్, కోచ్, మేనేజర్లకు వారు బసచేసిన హోటల్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ సూట్‌లు కేటాయిస్తారు.
మిగిలిన జట్టు సభ్యులకు కాస్తంత తక్కువ ఖరీదైన గదులు కేటాయిస్తారు. ఈ ప్రోటోకాల్ బంగ్లా పర్యటనలో కాస్తంత ఇబ్బందిగా మారనుంది. జూన్ 10 నుంచి 14 వరకు జరిగే టెస్టు మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే.
అనంతరం జరిగే మూడు వన్డేల సిరిస్‌కు కెప్టెన్‌గా ధోనిగా వ్యవహారించనున్నాడు. ప్రోటోకాల్ ప్రకారం ప్రస్తుతం కోహ్లీకి కేటాయించిన గదిని ఆ తర్వాత ధోనికి అప్పగించాలని అధికారులు ఆదేశించాలి. అయితే, ఇలా చేయడం వల్ల టెస్టు కెప్టెన్ కోహ్లీ నొచ్చుకుంటాడని భావించిన టీమిండియా మేనేజ్‌మెంట్ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది.

ఫతుల్లా టెస్టు మ్యాచ్ అనంతరం తమకు మరో ఎగ్జిక్యూటివ్ సూట్‌ను సిద్ధం చేయాలని ఇప్పటికే హోటల్ వర్గాలను బీసీసీఐ కోరినట్లు తెలిసింది. బంగ్లా పర్యటన మొత్తం టీమిండియా ఢాకా హోటల్లోనే బస చేయాల్సి ఉండడంతో కోహ్లీ, ధోనీలకు ప్రత్యేక గదుల విషయం అధికారులకు తలనొప్పిగా మారింది.
బంగ్లా పర్యటనలో టీమిండియాకు అతిథి మర్యాదలు అందుతున్నాయి. బంగ్లా పర్యటనకు మొత్తం 29 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు 26 సింగిల్ రూమ్స్ (రూ.9 వేలు), మూడు ఎగ్జిక్యూటివ్ సూట్‌లు కేటాయించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications