ఆరెస్సెస్‌తో కలిసి పని చేసేందుకు ముస్లీం ఫ్రంట్ ఓకే!

గుంటూరు: పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత దేశాలతో అఖండ భారత్‌ను ఏర్పాటు చేయాలనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) పిలుపును స్వాగతిస్తున్నామని ముస్లీం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ కలీం ఆదివారం అన్నారు.

గుంటూరు నగరంలోని బిఆర్ స్టేడియం రోడ్డులో జమాతే ఇస్లామి హింద్ కార్యాలయంలో ఆదివారం జరిగిన ముస్లీం సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖండ్ భారత్‌ కోసం ఆరెస్సెస్‌తో కలిసి పని చేస్తామన్నారు.

భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు మళ్లీ కలిసి పోయి అఖండ భారతావని ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ యాదవ్ ఇటీవల జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. కేవలం చారిత్రక కారణాలతో 60 ఏళ్ల క్రితం ఈ మూడు దేశాలు విడిపోయాయన్నారు.

Muslim United Front welcomes RSSs' AKhand Bharat

ఈ మూడు దేశాలు మళ్లీ కచ్చితంగా ఒకటైపోతాయని, అఖండ భారతావని ఏర్పడటం ఖాయమన్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో రామ్ యాదవ్ మాట్లాడారు.

ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్న తనకు ఆ విశ్వాసం ఉందని రామ్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకోరాదని ఇదే సందర్బంలో ఆయన అన్నారు. తామేదో ఇతర దేశాల మీద యుద్దానికి వెళ్తామనో, బలవంతంగా కలిపేసుకుంటామనో అనుకోనక్కర్లేదని రామ్ యాదవ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+