ఫైట్: నారా లోకేష్ ఫేస్‌బుక్, వైఎస్ జగన్ ట్విట్టర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ యువత నేత నారా లోకేష్ మధ్య సోషల్ మీడియాలో వార్ ప్రారంభమైంది. వైఎస్ జగన్‌పై నారా లోకేష్ ఫేస్‌బుక్ వార్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జగన్ ట్విట్టర్ వార్‌ను ప్రకటించి, చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు తనయుడు ఫేస్ బుక్ ను ప్రారంభించిన యుద్ధాన్ని ప్రకటించారు. ఫేస్ బుక్ పోస్టులతో జగన్‌ను ఉతికి ఆరేసే పనిచేస్తున్నారు. వరుసగా పోస్టులు చేస్తూ జగన్‌ను, వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

భయపడేవారు జగన్ చేసిన తప్పులను మరిపోయి ఉండవచ్చు గాక, కానీ జగన్ తన రాజధాని పర్యటనలతో అక్రమంగా సంపాదించిన సొమ్మును తన సమయాన్ని వృధా చేస్తున్నారని లోకేష్ విరుచుకుపడ్డారు. అతనికి రాష్ట్రం, రాష్ట్ర ప్రజలపై ఏ మాత్రం బాధ్యత ఉన్నా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు-మీరు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలు పాల్గొనాలని హితవు పలికారు.
కనీసం జగన్‌తోపాటు అక్రమాలకు పాల్పడిన వారు స్మార్టు విలేజ్- స్మార్టు వార్డు కార్యక్రమం కింద కొన్ని గ్రామాలనైనా దత్తతు తీసుకుని తాము చేసిన పాపానికి కొంత ప్రాయశ్చిత్తం కలుగుతుందని లోకేష్ తన ఫేస్ బుక్ పోస్టులో హితవు పలికారు.












Click it and Unblock the Notifications