కేరళకు మోడీ: ముఖ్యమంత్రికి రావొద్దని చెప్పారు!
తిరువనంతపురం: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో మాజీ ముఖ్యమంత్రి, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ఆర్ శంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఆహ్వానం వచ్చింది. ఆ తర్వాత నిర్వాహకులు.. హాజరు కావొద్దని చెప్పారు.
శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎస్ఎన్డీపీ) యోగం ప్రధాన కార్యదర్శి, కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్న వెల్లపల్లి నటేశన్ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం ఊమెన్ చాందీకి ఆహ్వానం అందింది.
అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్న నిర్వాహకులు సదరు కార్యక్రమానికి దూరంగా ఉండాలని సూచించారు. దీని పైన దీనిపై కాంగ్రెస్ పార్టీ పార్టీ భగ్గుమంది. పిలిచి, వద్దని చెప్పడమేమిటని 'ఎస్ఎన్డీపీ' వైఖరిపై మండిపడుతున్నారు.

'ఎస్ఎన్డీపీ' వైఖరిపై ఉమెన్ చాందీ సైతం విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉండాల్సిన అవసరం తనకు ఉందని, శంకర్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రే కాక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పని చేశారని, అంతేకాక ప్రొటోకాల్ ప్రకారం సీఎం హోదాలో ప్రధాని వెంట నేను ఉండాల్సి ఉందని, కానీ నిర్వాహకుల సూచన మేరకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ప్రధాని మోడీ మాజీ సీఎం శంకర్ విగ్రహాన్ని ఎన్ఎన్ కళాశాలలో ఆవిష్కరిస్తారు. 'ఎస్ఎన్డీపీ' ఆధ్వర్యంలో ఇది జరగనుంది. ప్రధాని మోడీ శ్రీ నారాయణ గురు కాలేజీ ఆఫ్ లీగల్ స్టడీస్ నూతన భవనాన్ని కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications