'పవన్ కళ్యాణ్ అన్నయ్యా! నాని పేజి ఓపెన్ కావట్లేదు'
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల పైన రెండు మూడు రోజులుగా ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ వేదికగా ఆయన వారిని ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేక హోదా పైన మూడు రోజుల క్రితం వారిని ప్రశ్నించిన పవన్ పైన టీడీపీ నేతలు భగ్గుమన్నారు. వారికి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇస్తున్నారు. బుధవారం, గురువారం వరుస ట్వీట్‌లతో వార్తల్లో నిలిచారు.

తన పైన నిప్పులు చెరిగిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నానికి చెందిన వివరాలను ఆయన ట్విట్టర్‌లో ఉంచారు. అందులోని వివరాలు ఏమిటో మీడియాలో వస్తున్నాయి. కానీ, ఆ లింక్ మాత్రం ఓపెన్ కావడం లేదు.
కేశినేని పార్లమెంటుకు హాజరైన శాతం, ఆయన ఏ చర్చల్లో పాల్గొన్నారు, ఏం మాట్లాడారనే వివరాలను పెట్టారని తెలుస్తోంది. అయితే, ఆ పేజ్ తెరుచుకోవడం లేదు. ఆ పేజి తెరుచుకోవడం లేదని పలువురు పవన్ కళ్యాణ్‌కు రీట్వీట్ చేస్తున్నారు. అన్నయ్య పేజ్ ఓపెన్ కావడం లేదని, పేజ్ నాట్ ఫౌండ్ అని రీట్వీట్ చేస్తున్నారు.
@PawanKalyan link not working bro
— Trinadh (@rajatrinath) July 9, 2015 @PawanKalyan Correct Links
http://t.co/9GFiuvxmnt
http://t.co/iVoqROZNTd
— Abhilash Sidd (@abhilash99) July 9, 2015 @PawanKalyan Link is here friends : http://t.co/Ls9FNA1zkW
— Hey ANDHRA Telugu (@HeyANDHRA4u) July 9, 2015 @PawanKalyan page not found
— kalyansai (@kalyan276) July 9, 2015 











Click it and Unblock the Notifications