ఒక వైపే చూస్తున్నారు, దేవుడు: శ్రీశాంత్ భార్య
కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడ్డ క్రికెటర్ శ్రీ శాంత్‌లో ప్రజలంతా ఒకే కోణా న్ని చూస్తున్నారని అతని భార్య భువనేశ్వరి చెప్పింది. శ్రీ శాంత్‌లో అందరికీ దూకుడైన స్వభావమే కనబడుతోందని, అతనిలోని అసలైన మనిషిని మాత్రం చూడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీపై మోపిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం కాదని తనకు తెలుసునని, భగవంతుడు దిగొచ్చి అతను తప్పు చేశాడన్నా తాను నమ్మబోనని ఆమె చెప్పింది. తాను చూసిన వారిలో శ్రీ అద్భుతమైన మనిషి అని, అతను నడిచే దేవుడన్నది తన నమ్మకమని భువనేశ్వరి అన్నది.

ప్రజలు శ్రీలోని నిజమైన పార్శ్వాన్ని చూడడం లేదని అన్నది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీశాంత్‌ను దేశమంతా అనుమానంతో చూస్తున్న కీలకమైన సమయంలో భువనేశ్వరి ముందుకు వచ్చి అతన్ని పెళ్లి చేసుకుంది.
శ్రీశాంత్, భువనేశ్వరి కలిసి ఓ చానెల్‌కు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. వారిద్దరు అప్పటి చీకటి రోజుల గురించి చెప్పుకొచ్చారు. శ్రీశాంత్‌పై కేసు పెట్టినప్పుడు తమ కటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, తాను పెళ్లి చేసుకుంటానని తన తండ్రికి కచ్చితంగా చెప్పానని భువనేశ్వరి చెప్పారు.












Click it and Unblock the Notifications