‘ప్రెసిడెంట్ మోడీ’: నాలుక్కర్చుకున్న ఒబామా
న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి అయ్యారు! ఎలా అనుకుంటున్నారా? అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మోడీకి స్వాగతం చెబుతూ.. ‘వెల్‌కమ్ ప్రెసిడెంట్ మోడీ' అన్నారు. సోమవారం మోడీ, ఒబామా భేటీ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఆ తర్వాత ఒబామా తప్పును గుర్తించిన వైట్ హౌజ్ అధికారులు సరిచేసేశారు. కాగా, వైట్‌హౌస్ వెబ్ సైట్ పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఒబామా చేసిన వ్యాఖ్యలే అలాగే ఉన్నాయి.

భేటీ సందర్భంగా ‘ప్రెసిడెంట్ మోడీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది' అని ఒబామా చెప్పారు.
కాగా, ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో సంచలనంగా మారింది. దీంతో ఆ తర్వాత వైట్ హౌస్ సిబ్బంది నాలుక కరుచుకుని, దాని రాత ప్రతిని విడుదల చేశారు. అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు.












Click it and Unblock the Notifications