రేవంత్ రెడ్డి మైండ్ గేమ్: బాస్ ఎర్రబెల్లి అంటూ ఎసరు?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ విచారణలో మైండ్‌గేమ్ ఆడుతున్నట్లు చెబుతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో డీల్ మాట్లాడుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి బాస్ అంటూ పదేపదే ప్రస్తావించిన విషయం వీడియో టేపుల్లో స్పష్టంగా రికార్డయిన విషయం తెలిసిందే.
సోమవారం విచారణ సందర్భంగా ఈ బాస్ ఎవరన్న ఏసీబీ అధికారుల ప్రశ్నకు రేవంత్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. తన బాసు ఎర్రబెల్లి దయాకర్‌రావు అని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఎర్రబెల్లి దయాకర్‌రావునే తాను బాసు అని పిలుస్తానని, చంద్రబాబును సార్ అంటానని చెప్పినట్లు సమాచారం.

రేవంత్ సమాధానంతో ఆశ్చర్యపోయిన ఏసీబీ అధికారులు, ఉద్దేశపూర్వకంగానే ఆయన ఎర్రబెల్లి పేరు చెప్పినట్టు అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి వాగ్మూలం ఆధారంగా ఎర్రబెల్లిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ఏసీబీ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. నిజంగా రేవంత్ చెప్పినట్టు ఎర్రబెల్లి బాసైతే వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల డాటాను చేధించాల్సి ఉంటుంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో విభేదాలు ఉన్న విషయం లోకవిదితమే. మరీ స్పష్టంగా, ఎర్రబెల్లికీ రేవంత్ రెడ్డికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలున్నాయి. మై హోం రామేశ్వర రావు ఉదంతంలో వారి మధ్య విభేదాలు బహిరంగంగానే వ్యక్తమయ్యాయి. ఈ స్థితిలో ఎసిబి అధికారులకు రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి పేరు చెప్పడం వెనక మతలబు ఉంటుందని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications