బిజెపిలోకి వస్తే ముఖ్యమంత్రి!: రేవంత్ రెడ్డికి భారీఆఫర్
హైదరాబాద్: కొడంగల్ యువ ఎమ్మెల్యే, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత, కేంద్రమంత్రి భారీ ఆఫర్ ఇచ్చారా? అంటే అవుననే చెబుతున్నారు. రేవంత్ బిజెపిలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఓ కేంద్రమంత్రి ప్రతిపాదించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం కేంద్రమంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడారు. రేవంత్ వాక్చాతుర్యానికి సదరు కేంద్రమంత్రి ముగ్దులయ్యారట. దీంతో, అతని వద్దకు వెళ్లి అభినందించారు.

ఇదే సమయంలో సదరు కేంద్రమంత్రి రేవంత్ రెడ్డికి మంచి ఆఫర్ ఇచ్చారట. మీరు బిజెపిలో చేరితే, మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని చెప్పాట. అయితే, తాను తెలుగుదేశం పార్టీలో సంతోషంగా ఉన్నానని, తనకు అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు మంచి అవకాశాలు కల్పించాలని చెప్పి.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారట.
టిడిపిలో రేవంత్ రెడ్డి కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ పైన రేవంత్ రెడ్డి ఊగిపోతున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారు. అనంతరం ఇటీవలే టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు.
-
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications