అందగాడు కాబట్టే రాజీవ్‌ను సోనియాగాంధీ పెళ్లాడారు
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అందగాడు కనుకనే సోనియా గాంధీ అతనిని పెళ్లి చేసుకున్నారని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరి తన పుస్తకంలో పేర్కొన్నాడు.
నైదర్ ఏ హాక్ నార్ ఏ డోవ్ అనే పుస్తకం రాశాడు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించాడు. 2005లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారత దేశాన్ని సందర్శించాడు. ముషారఫ్‌తో జరిగిన సమావేశానికి భారత విదేశాంగ శాఖ మంత్రి నట్వర్ సింగ్ వెంట సోనియా గాంధీ హాజరయ్యారు.
నిరీక్షణ గదిలో ఉన్న సోనియా గాంధీని కలిసిన సందర్భాన్ని ఆమెతో సరదాగా కాసేపు మాట్లాడిన విషయాలను ఆ పుస్తకంలో ఖుర్షీద్ కసూరి తన పుస్తకంలో పేర్కొన్నాడు.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తాను చదువుకున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటనను ఆయన పేర్కొన్నారు.
అందులో.. ఇఫ్తికార్ ఉద్దీన్ (గాంధీ-నెహ్రూ స్నేహితుడు, కాంగ్రెస్ నాయకుడు) కుమారుడు సోహాలి ఇఫ్తికార్‌తో కలిసి సరదాగా మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుండగా.. కింగ్ పరేడ్‌కు వ్యతిరేక దిశలో అందంగా ఉన్న ఒక యువకుడు నడుచుకుంటూ వస్తున్నాడు.
వెంటనే... అతను ఎవరని తాను సోహాలిని అడిగానని పేర్కొన్నాడు. అతని పేరు రాజీవ్ గాంధీ అని, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మనవడు అని చెప్పాడని పేర్కొన్నాడు.
ఇదే విషయాన్ని నాడు నిరీక్షణ గదిలో సోనియా గాంధీకి చెబితే.. రాజీవ్ గాంధీ అందగాడు కనుకనే నేను పెళ్లి చేసుకున్నానని తనకు చెప్పి నవ్వారని ఖుర్షీద్ తన పుస్తకంలో పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications