పెళ్లి కోసం ట్రైనీ ఐఎఎస్ డ్రామా: రూబీ అరెస్టు
ముస్సోరి: దొంగ ఐడీ కార్డుతో ఐఏఎస్ శిక్షణ పొందుతున్న రూబీ చౌదరీ పెళ్ళి కోసమే ఆ పని చేసినట్లు తేలింది. పెళ్ళి కోసమే రూబీ ట్రైనీ ఐఏఎస్ నాటకం ఆడిందని ఆమె భర్త వీరెందర్ మాలిక్ చెప్పారు. రూబీ ట్రైనీ ఐఏఎస్ అని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు పెళ్ళి సంబంధం కుదుర్చారని మాలిక్ చెప్పాడు.
ఆమె తరుచూ ముస్సోరిలోని ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీకి తరుచూ వెళ్లడంతో నిజమనుకున్నానని చెప్పాడు. రూబీని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు శనివారం ఆ విషయం చెపిపారు.
శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆమెను అరెస్టు చేసిన తర్వాత చీటింగ్, ఫోర్జరీ, వ్యక్తుల తారుమారు కేసులు పెట్టారు. నకిలీ ఐడెంటిటీ కార్డుతో ఆరు నెలలకు పైగా లాల్ బహదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో ఉన్నందుకు కూడా కేసు నమోదు చేశారు.

డెహ్రాడూన్‌లోని హోటల్‌పై పోలీసులు రెండు రోజుల పాటు నిఘా వేసి ఆమె కదలికలను నిశితింగా పరిశీలిస్తూ వచ్చారు. అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ సౌరబ్ జైన్‌పై కూడా కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే పోలీసులు అందుకు నిరాకరించారు.
జైన్‌ను కాపాడడానికి పెద్ద యెత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని చౌధరి ఆరోపిస్తోంది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా హెచ్చరించింది.












Click it and Unblock the Notifications