బెల్లీ డ్యాన్సర్లను తెచ్చి సచిన్ టెండుల్కర్ హంగామా

ముంబై: భారత క్రికెట్ జట్టు మేనేజర్‌ పుట్టిన రోజు వేడుకల కోసమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండుల్కర్.. అర్ధరాత్రి బెల్లీ డ్యాన్సర్లను తీసుకొచ్చి నృత్యం చేయించాడంట. ఈ విషయాన్ని అజిత్ వాడేకర్ చెప్పాడు. 1994లో తాను భారత జట్టుకు మేనేజర్‌గా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని చెప్పాడు.

'న్యూజిలాండ్‌ పర్యటనలో ఉండగా ఏప్రిల్‌ 1న తన పుట్టిన రోజు వచ్చిందని, ముందు రోజు చాలా సమయం నెట్స్‌లో గడపడంతో త్వరగా నిద్ర పోయానని, అర్ధరాత్రి ఎవరో తలుపు కొడుతున్న శబ్దం విని చూశానని, సచిన్ సీరియస్‌గా ముఖం పెట్టి కపిల్‌ దేవ్ ఏదో ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పాడని, తాను కపిల్‌ గదికి వెళ్లగానే కేకు, షాంపేన్‌ బాటిళ్లు కనిపించాయని, దీంతో ఆశ్చర్యపోయానని చెప్పాడు.

Sachin Tendulka

తనకు ఒక్కరొక్కరు శుభాకాంక్షలు చెబుతుండగానే, ఆరుగురు బెల్లీ డ్యాన్సర్లు గదిలోకి వచ్చారని, నృత్యాలు చేశారన్నారు. సునీల్‌ గవాస్కర్‌కు ఇలాంటి పనులు అలవాటన్నాడు. ఐతే ఆ పర్యటనలో అతను వ్యాఖ్యాతగా ఉన్నప్పటికీ ఆ గదిలో లేడని చెప్పాడు. కాబట్టి అది సచిన్‌ ఏర్పాటు చేసినట్లుగా అర్థమైందని చెప్పాడు. నెమ్మదిగా ఒక్కొక్కరే అక్కడి నుంచి వెళ్లిపోయారన్నాడు.

తాను రెండుమూడు గ్లాసులో షాంపైన్ తాగానని, గదిలో నుంచి ఒకొక్కరిగా అంతా వెళ్లిపోయారని, ఒక బెల్లీ డాన్సర్‌తో తాను మాత్రమే గదిలో ఉన్నానని చెప్పాడు. పరిస్థితిని గమనించిన తాను, జట్టు మేనేజర్‌ను కాబట్టి ప్రవర్తన నియమావళి గుర్తుకు వచ్చి తాను కూడా తన గదికి వెళ్లానని చెప్పాడు. షాంపైన్‌ను, బెల్లీ డాన్స్‌ను తాను బాగా ఎంజాయ్ చేశానని వాడేకర్ అన్నాడు.

అదే పర్యటనలో సచిన్‌ను ఓపెనర్‌గా పంపిన అంశంపై కూడా చెప్పాడు. సిద్ధూకు చీలమండల గాయం కావడంతో, మ్యాచ్ ఆడలేకపోయాడని, దీంతో సచిన్‌తో ఇన్నింగ్స్ ఆరంభించామని, దీనికి అజహర్, కపిల్‌లు ఆమోదం తెలిపారని, సచినే స్వయంగా వచ్చి.. తాను ఇన్నింగ్స్ ఆరంభిస్తానని చెప్పాడని తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+