ఐటి సోదాలు: సమంత తల్లిదండ్రుల చిందులు (వీడియో)
చెన్నై: సోదాలకు దిగిన ఐటి అధికారులపై, కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులపై హీరోయిన్ సమంత తల్లిదండ్రులు చిందులు వేశారు. హీరో విజయ్, హీరోయిన్ నయనతార ఇళ్లపైనే కాకుండా సమంత ఇంటిపై కూడా బుధవారం ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

సమంత తమిళనాడు రాజధాని చెన్నై పల్లవరం సారథి వీధిలోని అపార్టుమెంటులో నివసిస్తున్నారు. అదే అపార్టుమెండు రెండో అంతస్థులో సమంత తల్లిదండ్రులు ఉంటున్నారు. బుధవారం ఉదయమే ఐటి అధికారులు సమంత తల్లిదండ్రుల నివాసంలోకి ప్రవేశించారు.

ఆ సమాచారంతో మీడియా ప్రతినిధులు పెద్ద యెత్తున అక్కడికి చేరుకున్నారు. ఐటి అధికారులు సమంత, ఆమె తల్లిదండ్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లభించిన డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న సమయంలో సమంత తండ్రి జోసఫ్ ప్రభు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమంత తమ వద్ద డబ్బు, నగలు, డాక్యుమెంట్లు ఏమీ పెట్టదని, ఇంటికి కూడా అప్పుడప్పుడు వస్తుందని అన్నారు.
తాము అద్దె ఇంటిలో నివసిస్తున్నామని సమంత తల్లిదండ్రులు అధికారులతో ఆవేశంగా మాట్లాడారు. హీరోయిన్ సమంత షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నట్లు ఐటి అధికారులు చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !!












Click it and Unblock the Notifications