వేధింపులు: చెప్పుదెబ్బలు తిన్న విరాట్ ధోనీ

ఇండోర్: అతని పేరు మాత్రం విరాట్ ధోనీ. ప్రస్తుత టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీల పేరును కలుపుకుంటే అతని పేరు. కానీ, అతను చేసే పనులు మాత్రం అసభ్యంగా ఉంటాయి. యువతులను, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఊరుకుంటారా?మరి చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెంధ్వా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళాశాలకు వెళుతున్న యువతులను, పాఠశాలలకు వెళుతున్న బాలికలను తన వెకలిచేష్టలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసేవాడు విరాట్ ధోనీ అనే యువకుడు.

 Sex pest Virat Dhoni gets his behind thrashed by girls

అతని వేధింపులు భరించలేక బాధిత యువతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక మహిళా ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఆ యువకుడ్ని నడిరోడ్డుపై ఒంగోపెట్టి బాధిత యువతులతో చెప్పులతో కొట్టించారు.

కాగా, ఆ యువకుడు తనను బహిరంగంగా చెప్పులతో కొట్టించడం చాలా అవమానకరమని అన్నాడు. తనను బహిరంగంగా శిక్షించడం పోలీసుల పని కాదని చెప్పాడు. అంతేగాక తనకు జరిగిన అవమానాన్ని స్థానిక కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాడు. అయితే బాలికలను వేధింపులకు గురిచేసిన కారణంగా బహిరంగ శిక్ష సరేందేనని న్యాయమూర్తి చెప్పారు. దీంతో చేసేదేమి లేక ఇంటికి పయనమయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+