65 ఏళ్ల వయసులోనూ!: షబానా అజ్మీకి చిర్రెత్తించారు
న్యూఢిల్లీ: ఓ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలు తన పైన అందం గురించి కామెంట్ చేయడంతో.. నిరసనగా నిన్నటి తరం బాలీవుడ్ నటి షబానా అజ్మీ అవార్డు ఫంక్షన్ నుంచి వాకౌట్ చేసింది. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది.
ఎన్సీసీఐ ఎక్సలెన్స్ అవార్టులు ఇచ్చేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు షబానా అజ్మీని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొందరు ఆమె నొచ్చుకునేలా మాట్లాడారు.
ఓ పారిశ్రామికవేత్త మాట్లాడుతూ... 65 ఏళ్ల వయస్సులోను షబానా అజ్మీ యవ్వనంగా కనబడుతున్నారని, ఆమె సౌందర్య రహస్యం చెబితే బాగుంటుందని, ఆమెకు 65 ఏళ్ల వయస్సు ఉన్నట్లుగా కనిపించడం లేదన్నారు.

ఆ వ్యాఖ్యలతో నొచ్చుకున్న షబానా అజ్మీ వేదిక పై నుంచి కిందకు దిగి... ఆహ్వానితుల పక్కన మొదటి వరుసలో కూర్చున్నారు. ఆ తర్వాత కూడా మరో ఇద్దరు అలాగే మాట్లాడారు. దీంతో ఆమె కార్యక్రమం నుంచి బయటకు వెళ్లారు.
అయితే, దీనిని కొందరు కొట్టి పారేస్తున్నారు. ఎన్సీఆర్ చాంబర్ ఆఫ్ కామర్స్ యాదవ్ మాట్లాడుతూ... షబానా అజ్మీ తమకు కేవలం గంట సమయం మాత్రం ఇచ్చారని, ఫ్లైట్‌ను అందుకోవాల్సి ఉండటంతో ఆమె వెళ్లిపోయారని చెప్పారు.
ఆమె అందం పైన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. అది కాంప్లిమెంట్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ఆమె రైట్ స్పిరిట్‌తో తీసుకున్నారని చెప్పారు. అందం వ్యాఖ్యల కారణంగా ఆమె వేదిక నుంచి వెళ్లలేదన్నారు.












Click it and Unblock the Notifications