అల్కాహాల్‌ను వెదజల్లుతున్న ‘తోక చుక్క’!
లండన్: అంతరిక్షంలో జీవం ఉనికి కోసం అన్వేషిస్తున్న శాస్తవ్రేత్తలు ఆశ్చర్యకరమైన ఒక సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. ‘లవ్‌జాయ్' అనే తోకచుక్క పెద్ద మొత్తంలో ఆల్కహాల్‌ను విడుదల చేస్తోందని గుర్తించారు.
ప్రతి సెకనుకు దాదాపు 500 వైన్ బాటిళ్ల పరిమాణంలో ఇథైల్ ఆల్కహాల్ (ఇదే రకం ఆల్కహాల్‌ను మత్తుపానీయాల తయారీలో ఉపయోగిస్తారు)ను విడుదలచేస్తూ తన పేరును సార్థకం చేసుకుంటోందని శాస్తవ్రేత్తల బృందం తొలిసారి గుర్తించింది. జీవం ఆవిర్భావానికి ఎంతో ముఖ్యమైన సేంద్రియ పదార్థాలు ఈ తోకచుక్కలో ఉండవచ్చని ఈ ఆవిష్కరణ స్పష్టం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
‘లవ్‌జాయ్ తోకచుక్క ప్రతి సెకనుకు దాదాపు 500 వైన్ బాటిళ్ల పరిమాణంలో ఆల్కహాల్‌ను విడుదల చేస్తున్నట్లు మేము కనుగొన్నాం' అని ఫ్రాన్స్‌లోని పారిస్ అబ్జర్వేటరీకి చెందిన శాస్తవ్రేత్త నికోలస్ బివెర్ ‘జర్నల్ సైన్స్ అడ్వానె్సస్' పత్రికలో ప్రచురించిన పరిశోధనా పత్రంలో స్పష్టం చేశారు.

ఈ తోకచుక్కలో ఇథైల్ ఆల్కహాల్, గ్లైకాల్ ఆల్డీహైడ్ అనే ఒక రకం చక్కెర సహా 21 రకాల సేంద్రియ పదార్థాలు వాయువు రూపంలో ఉన్నట్లు శాస్తవ్రేత్తల బృందం గుర్తించింది. ఈ ఏడాది జనవరి 30న లవ్‌జాయ్ సూర్యుడికి అతి చేరువగా వచ్చిందని, ఆ సమయంలో సెకనుకు 20 టన్నుల నీటిని విడుదల చేసిందనే విషయాన్ని పరిశోధకుల బృందం గుర్తించింది.
ఆ సందర్భంలో లవ్‌జాయ్ పరిసర ప్రాంతాలు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాయనే విషయాన్ని స్పెయిన్‌లోని సియారా నెవడా పర్వతశ్రేణుల్లోని పికో వెలెటా వద్ద 30 మీటర్ల వ్యాసార్థమున్న టెలిస్కోప్‌ను ఉపయోగించి ఖగోళశాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ శక్తి కారణంగా తోకచుక్కలు సూర్యుడి సమీపానికి చేరుకుంటాయని, ఆ సమయంలో వేడిక్కిన తోకచుక్క వాయువులను విడుదల చేసి ఉంటుందనే అభిప్రాయాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు.
పరిశోధనల్లో భాగంగా అత్యవసర జీవితానికి అవసరమైన సేంద్రియ పరమాణువులు తోకచుక్కలో ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఎథైల్ అల్కహాల్, గ్లెకోలాడేహైడ్‌తోపాటు తోకచుక్క విడుదల చేసే వాయువుల్లో 21 రకాల సేంద్రియ పరమాణువులున్నాయని పరిశోధకులు గుర్తించారు.
తోకచుక్కలు విడుదల చేసిన ఈ పరమాణువులు ప్రాచీనకాలంలో భూమిపై ఉన్న జీవానికి ఊతమిచ్చి ఉండవచ్చనే సందేహాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిశోధన ఫలితాల ఆధారంగా తోకచుక్కల్లో క్లిష్టమైన రసాయనాలు ఉన్నాయనే ఆలోచనకు బలం చేకూరుతుందని మేరీల్యాండ్‌కు చెందిన పరిశోధకుడు స్టెఫానీ మిలయం పేర్కొన్నారు.
అంతరిక్షంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తోకచుక్కల్లో లవ్‌జాయ్ (సీ/2014 క్యూ2) అత్యంత ప్రకాశవంతమైందని పరిశోధకుల బృందం వెల్లడించింది.












Click it and Unblock the Notifications