ఈయన వల్లే కెసిఆర్ రాజీనామా: దానం యూటర్న్‌తో ఇలా
హైదరాబాద్: నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో విజయరామారావు కారణంగానే తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ను ఏర్పాటు చేశారు. విజయరామారావుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల కెసిఆర్‌కు ఇవ్వడం కుదరదలేదనే చంద్రబాబు మాటతో ఏకీభవించని కెసిఆర్ తీవ్ర అసంతృప్తికి గురై టిడిపి రాజీనామా చేశారు.
ఒకే కులం నుంచి ఇద్దరిని మంత్రులుగా తీసుకోవడం కుదరదని చెప్పి కెసిఆర్‌ను డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి చంద్రబాబు సరిపెట్టారు. ఈ వ్యవహారమంతా 2001లో జరిగింది. అప్పట్లో తటస్థులను పార్టీలోకి ఆహ్వానించే క్రమంలో చంద్రబాబు సిబిఐ డైరెక్టర్‌గా పనిచేసిన విజయరామారావు ఆహ్వానించి ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.
ఆ స్థానం నుంచి గెలిచిన విజయ రామారావును చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అదే టిడిపిలో చిచ్చు పెట్టగా, ఇప్పుడు మారిన స్థితిలో విజయరామారావు టిడిపికి రాజీనామా చేశారు. ఆయన టిఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది. గత కొంత కాలంగా విజయరామారావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికల కోసం పావులు కదుపుతున్న కెసిఆర్ ఖైరతాబాద్ నుంచే గతంలో పోటీ చేసిన కాంగ్రెసు నాయకుడు దానం నాగేందర్‌ను పార్టీలోకి తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, దానం నాగేందర్ యూటర్న్ తీసుకోవడంతో విజయరామారావును కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
విజయరామారావుతో కెసిఆర్ తరఫున మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు. మూడు రోజులుగా జరిగిన చర్చలు ఫలవంతం కావడంతో టిడిపికి విజయ రామారావు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. దానం నాగేందర్ పార్టీలోకి రావడానికి కొన్ని షరతులు పెట్టారని, ఆ షరతులకు టిఆర్ఎస్ అంగీకరించలేదని, దాంతోనే దానం యూటర్న్ తీసుకున్నారని చెబుతున్నారు. ఈ పరిణామంతో టిఆర్ఎస్ విజయరామారావుపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.

ఖైరతాబాదు శాసనసభా నియోజకవర్గంలో బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే తొలుత దానం నాగేందర్‌కు టిఆర్ఎస్ గాలం వేసిందని, ఆయన వెనక్కి వెళ్లిపోవడంతో విజయరామారావును పార్టీలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు సాగించి విజయం సాధించిందని చెబుతున్నారు.
దానం నాగేందర్ టిఆర్ఎస్‌కు వెళ్తారని భావించిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఖాళీని భర్తీ చేయడానికి విజయరామారావుతో చర్చలు జరిపారు. విజయరామారావును పార్టీలోకి కూడా ఆహ్వానించారు. అయితే, దానం వెనక్కి రావడంతో విజయరామారావు టిఆర్ఎస్ వైపు వెళ్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications