ఆయుధపూజ:రివాల్వర్లతో టిఆర్ఎస్ నేతల హంగామా
అదిలాబాద్: దసరా పర్వదినం రోజున ఆయుధ పూజ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు తుపాకులు, రివాల్వర్‌తో నిబంధనలకు విరుద్ధంగా గాలిలోకి కాల్పులు జరిపారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డిలు తుపాకులతో హంగామా సృష్టించారు.
ఇంద్రకరణ్ అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో తన కుటుంబ సభ్యులతో ఆయుధ పూజ చేశారు. అనంతరం తన ఇంటి ఆవరణలో రెండు రౌండ్లు గాల్లోకి కాల్చారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

మరోవైపు, మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ జితేందర్ రెడ్డి కాల్పుల చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద దసరా రోజున తన గన్‌మెన్‌తో, కుటుంబ సభ్యులతో కలిసి ఆయుద ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications