ముక్కు పగిలింది: పార్లమెంట్లో కొట్టుకున్న ఎంపీలు

కీవ్: ఇద్దరు పార్లమెంటు సభ్యులు కొట్టుకున్నారు. మామూలుగా కాదు.. సినిమాలో హీరో, విలన్లను తలపించేలా ఫైటింగ్ చేశారు. అదీ పార్లమెంటు భవనం వద్ద. ఉక్రెయిన్ దేశానికి చెందిన ఇద్దరు ఎంపీలు పార్లమెంటు భవన్ ముందే తీవ్రంగా కొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు.

శుక్రవారం నాడు వారిద్దరు కొట్టుకున్న వీడియో ఫుటేజీలు హల్‌చల్ సృష్టిస్తున్నాయి. ఈ ఫైటింగ్‌లో ఓ ఎంపీ ముక్కు పగిలి, రక్తం కూడా కారింది. సమాచారం మేరకు... అవినీతి బిల్లు పైన ఇరువురు ఎంపీల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అది కాస్తా మాటల యుద్ధానికి దారి తీసింది. అది ముదిరి ఇరువురు కూడా తీవ్రంగా కొట్టుకున్నారు.

Ukraine MPs in fierce fist fight outside parliament

కొట్టుకున్న ఎంపీలలో... సామోపోమోచి పార్టీకి చెందిన యీగోర్ సోబోలేవ్, ఫాదర్లాండ్ పార్టీకి చెందిన వాదిమ్ ఇవ్‌చెంకోలు ఉన్నారు. ఇరువురును అక్కడి భద్రతా సిబ్బంది విడిపించవలసి వచ్చిందని సమాచారం. దీనిని ఇంటర్నెట్లో బాగా చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+