'స్మగ్లర్ వీరప్పన్' పేరుతో అమెరికా కంపెనీ తైలం
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో పేరు మోసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఇప్పుడు ఒక అంతర్జాతీయ కాస్మెటిక్స్ కంపెనీకి పోస్టర్ బాయ్‌గా మారటం ఒక వింతలా అనిపిస్తోంది. వీరప్పన్ మరణించిన 10 సంవత్సరాల తర్వాత అమెరికాకు చెందిన ఓ కంపెనీకి ప్రచారకర్తగా మారాడు.
అమెరికాకు చెందిన కంపెనీ ‘లాష్ కాస్మొటిక్స్ సంస్థ' ‘వీరప్పన్ ముస్టాక్ వాక్స్' పేరుతో ఓ రకమైన తైలాన్ని విక్రయిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని లాష్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ తైలం ఖరీదు 15.95 డాలర్లు.

సుమారు 8 గ్రాముల బరువు ఉంటే ఈ తైలాన్ని లాష్ కాస్మొటిక్స్ సంస్థ ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు జరుపుతోంది. దీంతోపాటు కొత్తగా తయారు చేస్తున్న ‘గొరిల్లా పర్‌ఫ్యూమ్స్'కి కూడా వీరప్పన్ చిత్రాన్ని వాడుకోవడానికి ఈ అంతర్జాతీయ కంపెనీ సిద్ధమైంది.
2004లో స్మగ్లర్ వీరప్పన్‌ని కాల్చి చంపక ముందు సుమారు 200 ఏనుగులను చంపి వాటి దంతాలను విదేశాలకు తరలించడంతో పాటు గంధపు చెక్కల వ్యాపారం చేసేవాడు. గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను సునాయసంగా అడవి దాటించేవాడు. వీరప్పన్ పూర్తి పేరు కూసే మునిస్వామి వీరప్పన్.












Click it and Unblock the Notifications