'ప్రత్యేక' పోరు: హీరో శివాజీ వెనక ఎవరు?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న సినీ హీరో శివాజీ వెనక ఎవరున్నారనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. తాను ఓ సామాన్యుడిగా ఒక్కడినే పోరాటం చేస్తున్నానని శివాజీ చెబుతున్నప్పటికీ ఎవరో ఉండే ఉంటారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఇంతకు ముందు విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాల్లో హల్ చల్ చేసిన శివాజీ రేపు ఆదివారం గుంటూరులో దీక్ష చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఆయన బిజెపిని, బిజెపి నాయకులను తీవ్రంగా తప్పు పడుతున్నారు. తాను బిజెపి నాయకుడిని అని చెబుకుంటూ దీక్షలు చేయడం, విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తమ పార్టీతో శివాజీకి ఏ విధమైన సంబంధం లేదని బిజెపి నాయకులు ప్రకటించారు.

Who is behind actor Shivaji?

తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని శివాజీ జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను కూడా కోరారు. పవన్ కళ్యాణ్ కూడా ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అంటున్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను బిజెపి నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. శివాజీకి పవన్ కళ్యాణ్ అండదండలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

కాగా, తెలుగుదేశం పార్టీని గానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గానీ శివాజీ ఎక్కువగా తప్పు పట్టినట్లు కనిపించడం లేదు. శివాజీ వ్యూహాత్మకంగానే ఆ రకంగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. తనకు రాజకీయ లక్ష్యాలు లేవని శివాజీ అంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి పెట్టుకున్న రాజకీయ లక్ష్యంతోనే ఆయన వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మొత్తం మీద, బిజెపికి శివాజీ కొరకరాని కొయ్యగానే తయారైనట్లు కనిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+