చీటింగ్: భర్త ఖరీదైన కారును పగులగొట్టిన భార్య!
బీజింగ్: చైనాలో భర్త తనను చీటింగ్ చేశాడని తెలుసుకున్న ఓ భార్య... తన భర్తకు చెందిన ఖరీదైన కారును పగులగొట్టే ప్రయత్నం చేసింది. తన భర్త పైన ఆగ్రహం వచ్చిన సదరు భార్య.. ఓ సుత్తి తీసుకొని వచ్చి కారు పైన దెబ్బ మీద దెబ్బ కొట్టింది.
ఆమె అంతగా బలంగా కొట్టినప్పటికీ కారుకు సొట్టలు కూడా పడలేదు. కేవలం కారు అద్దాలు, లైట్లు మాత్రమే ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనను ఎవరో చాటుగా వీడియో తీశారు. ఇది రెండు నిమిషాల నిడివి గల వీడియో.
భర్త పైన ఆగ్రహాన్ని ఆమె కారు పైన చూపించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆమె దాదాపు ఇరవై నిమిషాల పాటు సుత్తి, రాడ్డు పట్టుకొని వచ్చి కారును కొట్టింది. తనను చీటింగ్ చేసిన.. తన భర్త కారులోనే ఉన్నాడని భావించిన ఆమె అలా చేసిందని వీడియో తీసిన వ్యక్తి చెబుతున్నాడు.
ఈ కారు విలువ ఆరు కోట్ల రూపాయల విలువ కలిగినది. కాగా, ఈ వీడియో తీసిన వ్యక్తి... పక్కనే ఉంటున్న మరో ఇంటి వ్యక్తి కారు చాటుగా ఉండి ఈ వీడియోను తీశాడు. కాగా, భర్తలు తమను చీటింగ్ చేస్తే ఇంట్లోని వాహనాల పైన భార్యలు ఆగ్రహం చూపించడం చైనాలో ఇటీవల సాధారణమైందట.












Click it and Unblock the Notifications