బంధించింది: భర్తపై 29 గంటలు రేప్ చేసిన భార్య
సియోల్: తన భార్య తన మీద 29 గంటల పాటు అత్యాచారం చేసిందని ఓ భర్త పోలీసులను ఆశ్రయించిన సంఘటన దక్షిణ కొరియాలో జరిగింది. దక్షిణ కొరియా పోలీసులు 40 సంవత్సరాల మహిళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైవాహిక అత్యాచారం చెయ్యడం నేరం అంటూ 2013వ సంవత్సరంలో దక్షిణ కొరియా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. భర్తను 29 గంటల పాటు గదిలో బంధించి బలవంతంగా అతడిని శృంగారానికి పురిగొల్పిందని, అత్యాచారం చేసిందని పోలీసులు కేసు నమోదు చేశారు.

దక్షిణ కొరియా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ఓ మహిళ మీద ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే మొదటి సారి అని అక్కడి పోలీసులు అంటున్నారు. విడాకులు తీసుకోవడానికి గట్టి సాక్ష్యం కావాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నేరం చేసి ఉంటుందని పోలీసులు చెప్పారు. ఆమె వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలలో వైవాహిక అత్యాచారం చెయ్యడం పెద్ద నేరం అవుతుంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచంలోని 104 దేశాలలో వైవాహిక అత్యాచారం చెయ్యడం నేరం అని నిర్దారించి అలాంటి కేసులను కోర్టులు విచారించడానికి ఆ దేశాలలోని ప్రభుత్వాలు అంగీకరించాయి.












Click it and Unblock the Notifications