నకిలీ ఐఏఎస్: అకాడమీలో 6 నెలలు బస, అరెస్టు

న్యూఢిల్లీ: నకిలీ పత్రాలతో ముస్సోరీలోని అకాడమీలో శిక్షణ పొందిన నకిలీ ఐఏఎస్ అధికారిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ హోటల్ రూమ్‌లో ఆమెను గుర్తించిన పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అసలు ఆమె అక్కడికి ఎందుకు వెళ్లిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మకమైన ముస్సోరీలోని 'లాల్ బహూదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ'లో ఓ నకిలీ మహిలా ఐఏఎస్ సుమారు ఆరు నెలలు పాటు బస చేసింది. నకిలీ పత్రాలతో ఐఏఎస్ ట్రైనీనంటూ వచ్చి అకాడమీలో చేరి, ఆరు నెలలు పాటు దర్జాగా ఉంది.

 Woman stays at Mussoorie academy for 6 months masquerading as IAS officer

ఈ విషయంపై అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమె ఆచూకీ కనుగొనేందుకు దర్యాప్తును చేపట్టారు. ముస్సోరీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముజఫర్ నగర్‌కు చెందిన రూబీ చౌధురిగా తనను తాను పరిచయం చేసుకున్న ఆ మహిళ గత సెప్టెంబర్ 20న తారీఖున అకాడమీకి వచ్చింది.

అనంతరం అకాడమీలో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు చూపించి ప్రవేశం పొందినట్లు అధికారులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 'లాల్ బహూదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ'లో ఉన్న అన్ని రోజులు లైబ్రరీని ఉపయోగించుకునే సందర్భంలో తనని ఓ ఐఏఎస్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకొనేదని లైబ్రరీ వర్గాలు తెలిపాయి.

అయితే ఆమె ఉన్నట్టుండి మార్చి 27 నుంచి కనిపించకపోవడంతో అధికారులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కట్టుదిట్టమైన భద్రతతో ఉండే అకాడమీలోకి ఆమె అసలు ఎలా ప్రవేశించిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె గది నుంచి మార్క్ లిస్ట్‌ల పాటు, ఏటీఐ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్న పత్రాలను ఎఫ్‌ఐఆర్‌కు జత చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+