షాకింగ్: రూ.లక్షలతో ఐఫోన్లు కొని, సుత్తితో పగులగొట్టాడు
బీజింగ్: చైనాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి లక్షలాది రూపాయలు వెచ్చించి పది ఐ ఫోన్లు కొన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వాటిని తాను కొన్న దుకాణం ముందే సుత్తితో కొట్టి పగులగొట్టాడు. ఫోన్లో సమస్య రావడంతో దుకాణదారు వద్దకు వెళ్లగా, అతను బాగు చేసేందుకు నిరాకరించాడు.
సదరు వ్యక్తి తన ఐ ఫోన్‌లో సమస్య రావడంతో ఐఫోన్ స్టోర్‌కి వెళ్లి దాన్ని రిపేర్ చేయమని చెప్పాడు. అయితే, షాపు యజమాని ఆ ఫోన్‌ని రిపేర్ చేయనని చెప్పాడు. డబ్బులు ఉంటే కొత్త ఐఫోన్ కొనుక్కోమని ఎగతాళి చేశాడు. దీంతో రిపేర్ చేయించుకోవడం కోసం వచ్చిన వ్యక్తికి కోపం వచ్చింది.
ఎందుకు బాగు చేయరని నిలదీశాడు. దుకాణదారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఐఫోన్ షాపులో ఉన్న ఐఫోన్లన్నింటినీ తాను కొనేస్తానని అన్నాడు. షాపులోని వారు ఆ వ్యక్తి సరదాగా అలా మాట్లాడుతున్నాడనుకున్నారు.

కానీ, కోపంతో ఉన్న ఆ వ్యక్తి నిజంగానే షాపులో ఉన్న 10 ఐఫోన్లను కొన్నాడు. అనంతరం అక్కడే ఆ ఫోన్లన్నింటినీ సుత్తితో పగలకొట్టాడు. దీంతో అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగలేదు. మరింత ఆశ్చర్యం కలిగించేలా మరో పని కూడా చేశాడు.
అతనిని రెచ్చగొట్టేలా షాపు యజమాని మరోసారి మాట్లాడాడు. రూ. 6.2లక్షలు పెట్టి ఐఫోన్లను కొని పగులకొట్టొచ్చు, కానీ నా దుకాణం మొత్తాన్ని ఏమీ చేయలేవన్నాడు. మరింత రెచ్చిపోయిన ఆ వ్యక్తి షాపు విలువ ఎంతో కనుక్కున్నాడు. అనంతరం రూ. 50లక్షలు ఇచ్చి షాపు మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఉంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications