అప్పు చేసి రాహుల్ గాంధీకి భోజనం పెట్టిన దళితుడు
లక్నో: దళితులు, నిరుపేదల ఇళ్లలో భోజనాలు చేయడం, వాటిని ఫోటోలు తీసి పబ్లిసిటీ కోసం రాజకీయ నాయకులు వాడుకోవడం రాజకీయాల్లో షరా మామూలే. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా గత ఆదివారం మౌ అనే గ్రామంలోని ఓ దళితుని ఇంటికి వెళ్లారు.

రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ కూడా వెళ్లారు. ఈ ఇద్దరూ ఆ దళితుని ఇంట్లో భోజనం చేశారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తాము పేదరికం అనుభవిస్తున్నామని ఈ సందర్భంగా ఆ ఇంటి యజమాని స్వామినాథ్ రాహుల్ గాంధీతో చెప్పాడు.
Mau (UP): Dalit family who offered food to Rahul Gandhi had borrowed food material from others to prepare food. pic.twitter.com/Y60htOKv8a
— ANI UP (@ANINewsUP) September 15, 2016
Rahul Gandhi was like a God to us so we had to prepare no matter what. Will repay the debt somehow: Family member pic.twitter.com/m3MHajO1fT
— ANI UP (@ANINewsUP) September 15, 2016
రాహుల్ గాంధీ పర్యటన ముగిసిన తర్వాత తెలిసింది ఆ దళిత కుటుంబం కటిక పేదరికంలో మగ్గుతోంది. తమ ఇంటికి అతిథులుగా వచ్చిన రాహుల్, ఆజాద్‌లకు వండి పెట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఆ దళితుడు పొరుగింటినుంచి అప్పు తీసుకున్నారు. ఆ డబ్బుతో రాహుల్ గాంధీకి రోటీ, ఆటూ చోకా వండి పెట్టారు.
రాహుల్‌గాంధీ తమకు దేవుడిలాంటి వాడని, అందుకే అప్పు చేసి అయినా ఆయనకు మంచి భోజనం పెట్టాలని అనుకున్నట్లు స్వామినాథ్ చెప్పాడు. ఎప్పుడోసారి ఆ అప్పు తీర్చేస్తానని అన్నాడు. రాహుల్‌తో తమ సమస్యలు చెప్పుకున్నా.. ఇలా భోజనానికి కూడా అప్పు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం ఆయనకు చెప్పలేదని అన్నాడు.












Click it and Unblock the Notifications