హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా అజహరుద్దీన్?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్ఎంసి) ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌ను రంగంలోకి దించేందుకు ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌కు చెందిన అజహరుద్దీన్ సెలబ్రిటీ కావడంతోపాటు యువతలో మంచి ఫాలోయింగ్ ఉండటం తమకు కలిసివస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్ర, హైదరాబాద్ నేతలకు సూచనలు చేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఐఎం దూరం కావడం, అధికార టిఆర్ఎస్ పార్టీ పలు కార్యక్రమాలతో దూసుకుపోతుండంతో కాంగ్రెస్ నేతలు సైతం తనదైన వ్యూహాలతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎంఐఎంకు ఎదుర్కొవడంతోపాటు, టిఆర్ఎస్ పార్టీని కట్టడి చేయొచ్చన్న ఆలోచనతో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం.. మేయర్ ప్రతిపాదనను అజహరుద్దీన్ ముందుంచినట్లు తెలిసింది. అయితే, తన నిర్ణయాన్ని ఇప్పుడే వెల్లడించలేనని, సమయం కావాలని అజహరుద్దీన్ చెప్పినట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇక హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో ఈ మాజీ టీమిండియా కెప్టెన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లేదా పంజాగుట్ట నుంచి అజహరుద్దీన్ కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో అజహరుద్దీన్ కొంత కాలంపాటు హైదరాబాద్ నగరంలోనే బస చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున మురాదాబాద్ నుంచి పోటీ చేసిన అజహరుద్దీన్ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications