చైనాలో వింత: కళ్లు లేని శిశువు జననం
బీజింగ్: తనకు జన్మించిన శిశువుని చూసి ఓ కన్న తల్లి ఆందోళనకు లోనైన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆమె అంతలా ఆందోళన చెందడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా? తనకు జన్మించిన శిశువుకు కళ్లు లేకపోవడమే. చైనా మీడియా కూడా ఈ సంఘటనపై పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించాయి.
వివరాల్లోకి వెళితే... ఈ నెల 20న చైనాలోని గాంగ్జౌ ప్రాంతానికి చెందిన లీ పెయ్‌హువా పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. అయితే ఆ శిశువుకు కళ్లు లేవు. వెంటనే ఆ శిశువుని గాంగ్జౌ ప్రావిన్స్‌లో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులకు చూపించింది. ప్రతి పది వేల మందిలో 30 మంది మాత్రమే ఇలా జన్మిస్తారని వైద్యులు తెలిపారు.

అనోఫ్తాల్మియా అనే అవలక్షణాల వల్లే ఇలా జరుగుతుందని చికిత్స అనంతరం వైద్యులు తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుంచి అన్ని పరీక్షలు చేయించుకున్నామని, ఎలాంటి లోపాలు కనిపించలేదని లీ పెయ్‌హువా కుటుంబ సభ్యులు తెలిపారు. అసలు ఇలా ఎలా ఎందుకు జరిగిందో తమకు అర్థంకావడం లేదని వాపోయారు.

గర్భధారణ సమయంలో తీసే ఆల్ట్రాసౌండ్ లేదా ఇతర టెస్టుల్లో ఈ అనోఫ్తాల్మియా లక్షణాలు తెలియవని వైద్యులు పేర్కొన్నారు. దీంతో పాటు మరేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో శిశువుకు కుటుంబ సభ్యులు పరీక్షలు చేయిస్తున్నామని చెప్పారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications