సిగ్గులేకుండా: హోదాపై తిట్టుకున్న ఎమ్మెల్యే, బిజెపి నేత

విజయవాడ: టీవీ లైవ్ షోలో విజయవాడ ఎమ్మెల్యే, ఇటీవలే వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన జలీల్ ఖాన్ పైన బిజెపి నేత ఒకరు తిట్ల వర్షం కురిపించారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. సిగ్గులేని నేతవంటూ ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు.

ఏపీకి ప్రత్యేక నిధులు ఇస్తున్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకని కేంద్రమంత్రి హెచ్ పీ చౌదరి శుక్రవారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టీవీ ఛానల్ లైవ్ షోలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జలీల్ ఖాన్, బిజెపి నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌‍లు వ్యక్తిగత దూషణలకు దిగారు.

BJP leaders, MLA Zaleel Khan hot comments

జలీల్ ఖాన్ వ్యక్తిగత దూషణకు దిగారు. దీనిపై బిజెపి నేత వెల్లంపల్లి అదే స్థాయిలో స్పందించారు. సిగ్గూ, శరం లేకుండా ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారిపోయిన నువ్వా నన్ను విమర్శించేది? ప్రత్యేక హోదా గురించి అడిగే హక్కు కూడా నీకు లేదని ధ్వజమెత్తారు.

దీనిపై జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు నన్ను అంటావా అంటూ విరుచుకుపడ్డారు. పరస్పరం దూషించుకున్నారు. కాగా, ఇటీవల బొండా ఉమ, చెవిరెడ్డి భాస్కర రెడ్డిలు కూడా పరస్పరం తిట్టుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+