బిత్తరపోయారు!: జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో సన్నిలియోన్ నగ్నచిత్రం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) కూడా ఆకతాయిల నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో పోర్న్ స్టార్. బాలీవుట్ నటి సన్నీ లియోని నగ్నచిత్రం కనిపించింది.
దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో చెత్తను తరలించేందుకు ఉపయోగించే వాహనాల రాకపోకల కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా చెత్తను తరలించే వాహనాల రాకపోకలను గమనించే పేజీ(ఓఎస్‌ఆర్టీ ఆప్షన్)లో సన్నీ లియోని నగ్నచిత్రం ప్రత్యక్షమైంది.

దీంతో జీహెచ్ఎంసీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వానికి చెందిన ఓ అధికారిక వెబ్‌సైట్‌లో సన్నీలియోని నగ్నచిత్రం కనిపించడంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరో ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఈ పనికి పాల్పడని ఉంటారనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
పేజీ ఓపెన్ చేయగానే సన్నీలియోని చిత్రం దర్శనమిస్తుండటంతోతల పట్టుకున్న అధికారులు, వెంటనే టెక్నికల్ టీముకు సమాచారం ఇవ్వగా, వారు దాన్ని తొలగించినట్టు తెలుస్తోంది. ఎవరో హ్యాకర్లు ఈ పని చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో సన్నీ లియోని నగ్న చిత్రం ప్రత్యక్షం మవడంపై సైఫాబాద్ పోలీసులను వివరణ కోరగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications