వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడ్ లైట్ ఏరియాలో కూడ నగదు రహిత చెల్లింపులకు ఓకే, ఆన్ లైన్ చెల్లింపుల కోసం శిక్షణ ఇవ్వండి

రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారిణులు నగదురహితం వైపుకు మళ్ళారు,పేటీఎం ద్వారా చెల్లింపులు చేసి తమ వద్దకు రావచ్చని వ్యభిచారిణులు పబ్లిసిటీ చేస్తున్నారు. ఆన్ లైన్ లో నగదు రహిత లావాదేవీలపై శిక్షణ ఇవ్వాలని కోరు

By Narsimha
|
Google Oneindia TeluguNews

మహరాష్ట్ర : పెద్ద నగదు నోట్ల రద్దు రెడ్ లైట్ ఏరియాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోవడం, రద్దుచేసిన నగదును తీసుకొనేందుకు వ్యభిచారిణులు ముందుకు రావడం లేదు. ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్న వ్యభిచారిణులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు కూడ నగదు రహితానికి ముందుకు వచ్చారు. నగదు రహిత పద్దతుల ద్వారా డబ్బులు చెల్లించే అవకాశం ఉందంటూ ప్రచారాన్ని ప్రారంభించారు.

పెద్ద నగదు నోట్ల రద్దుతో రెడ్ లైట్ ఏరియాలో వ్యాపారాలు మందగించాయి. దీంతో చాలా రోజుల పాటు పస్తులు ఉండాల్సిన పరిస్థితుుల నెలకొన్నాయని వ్యభిచారిణులు చెబతుున్నారు. రద్దుచేసిన నగదు తీసుకొంటే మార్పిడి చేసుకోవడం ఇబ్బంది. కొత్త కరెన్సీని తమ అవసరాలు తీర్చుకొనేందుకు కూడ అందుబాటులోకి లేకపోవడంతో వ్యభిచారిణులు ఇబ్బందులు పడుతున్నారు.

cashless transacations implement at redlight area in maharastra

నగదు రహితం వైపుగా అడుగులు వేస్తోన్న రెడ్ లైట్ ఏరియా వాసులు

తమ పూట గడవాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలని వ్యభిచారిణులు నిర్ణయించుకొన్నారు. నగదు రహిత పద్దతుల ద్వారా తమకు డబ్బులను చెల్లించే వెసులుబాటును కల్పించారు. ఈ మేరకు మహరాష్ట్రలోని రెడ్ లైట్ ఏరియాలో పేటీఎం చెల్లింపులు అంగీకరించబడును అంటూ బోర్డును ఏర్పాటుచేశారు.

అంతే కాదు తమ ఏరియాలో ఉన్న పాన్ షాపు లో పేటిఎం లో నగదును చెల్లించి తమ వద్దకు రావచ్చని వ్యభిచారిణులు చెబతుున్నారు. అయితే రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళే వారిలో నగదురహిత చెల్లింపులు తెలిసిన వారు ఎంత మంది ఉంటారు. అయితే దేశ వ్యాప్తంగా నగదు రహితం వైపుకు వెళ్ళేలా అనివార్య పరిస్థితులు కన్పిస్తోన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ పద్దతులకు అలవాటు పడాల్సిందే.

పేటిఎం ఏజంట్లను సంప్రదించి తాము కూడ నగదు రహిత విధానాలను అలవాటు పడుతున్నట్టు వ్యభిచారిణులు చెబుతున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే తమకు జీవనం గడవడం కష్టంగా మారుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. పాన్ కార్డులకు ధరఖాస్తు చేసుకొంటున్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆన్ లైన్ లో నగదును తీసుకోవడం పై శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు వ్యభిచారిణులు.

English summary
cashless transacations implement at redlight area in maharastra,after demonatasation visitors decrease redlight area.so they implement cashless transacations for prostitution.wide publicity about this cahsless transactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X