బంగారు మరుగుదొడ్డి: అమెరికన్లకు మాత్రమే ఛాన్స్
న్యూయార్క్: బంగారంతో తయారు చేసిన మరుగుదొడ్డిని చూడాలంటే న్యూయార్క్‌కు వెళ్లాల్సిందే. న్యూయార్క్‌లోని సాలమన్ ఆర్. గుగెన్ హీమ్ మ్యూజియం 18 క్యారెట్ల బంగారంతో ఓ మరుగుదొడ్డిని రూపొందించింది. ఏదో సరదా కోసం దీన్నిలా డిజైన్ చేశారనుకుంటే పొరపాటు పడ్డట్టే.
ఈ మరుగుదొడ్డిని ఉపయోగింవచ్చు. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన దీనిని ఉపయోగించుకునేందుకు అమెరికన్లందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు గుగెన్ హీమ్ మ్యూజియం ప్రకటించింది. ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మారిజియో కాటెలన్ ఈ మరుగుదొడ్డిని మ్యూజియంలోని నాలుగో అంతస్తు రెస్ట్ రూమ్‌లో ఏర్పాటు చేశాడు.

దీనిని చూసేందుకే కాకుండా ఉపయోగించుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది. 2011 నుంచి ఇలాంటివాటిని తయారు చేస్తున్నప్పటికీ, తొలిసారిగా దీనిని ప్రదర్శనకు ఉంచారు. మ్యూజియంకు వచ్చే సందర్శకులు ఒకసారి దానిపై కూర్చోవడానికి మ్యూజియం వారు అనుమతిస్తున్నారు.
ఇటువంటి కళాఖండాల గురించి మరింత ప్రచారం కల్పించేందుకే ప్రజలందరికీ దీనిని ఉపయోగించే అవకాశం కల్పించామని మ్యాజియం పేర్కొంది. ఆర్ట్ మార్కెట్‌కు ఆదరణ పెరగడానికి ఇటువంటి చర్యలు ఉపయోగపడతాయని మ్యూజియం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.












Click it and Unblock the Notifications