సందడి: మహిళలతో కలిసి స్టెప్పులేసిన చంద్రబాబు
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో నందినాటకోత్సవం ముగింపు బుధవారం జరిగింది. ఈ ముగింపు వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టెప్పులేసి అందర్నీ అలరించారు. చంద్రబాబు తిరుపతిలో బుధవారం నాడు సుడిగాలి పర్యటన చేశారు.
ఆయన బుధవారం ఉదయం విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీబిజీగా గడిపారు. చివరగా నగరంలోని మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నంది నాటకోత్సవ అవార్డులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా అక్కడి కళాకారులతో కలిసి చంద్రబాబు కాలు కదిపారు. మహిళా కళాకారులతో కలిసి స్టెప్పులేసి, హాజరైన వారికి కనువిందు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కళలనే కాక కళాకారులకు కూడా తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications