రోజాతో పోల్చొద్దు, ఆ మాటలు చేతకాదు: జయసుధ
హైదరాబాద్: తనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజాతో పోల్చవద్దని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే జయసుధ అంటున్నారు. ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రోజా తనకు మంచి స్నేహితురాలు అని చెప్పారు.
రోజా సినిమాపరంగా తనకు మంచి మిత్రురాలు అన్నారు. కానీ ఆమెలా మాట్లాడటం తనకు చేతకాదని చెప్పారు. రోజాకు పోటీగా తనను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారనే వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ఇది పెద్ద జోక్ అన్నారు. రోజాకు తనకు పోలికనే లేదని వ్యాఖ్యానించారు.

రోజా స్థాయిలో మాట్లాడనని తేల్చి చెప్పారు. రోజా స్థాయిలో మాట్లాడే పరిస్థితులు వచ్చినా తాను అలా మాట్లాడనని చెప్పారు. అలాంటి మహిళగా నేను ఉండదల్చుకోలేదని అభిప్రాయపడ్డారు. అలాంటి భాష తనకు అవసరం లేదని చెప్పారు.
తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మంచిగానే సమాధానం చెబుతానన్నారు. ఏకే 47తో కాల్చినా, సైలెంట్ తుపాకీతో కాల్చినా ఒకేలా ఉంటుందన్నారు. నా వరకు పరుషంగా మాట్లాడాల్సిన అవసరం లేదని జయసుధ అభిప్రాయపడ్డారు. ఆమె పది మాటలు మాట్లాడితే నేను ఒక్క మాటతో తిప్పికొడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications