మీ బండారం బయటపెడ్తా: ఏపీ మంత్రికి ఇంజినీరింగ్ బెదిరింపు
కడప: డబ్బు కోసం ఏకంగా రాష్ట్ర మంత్రినే బ్లాక్‌మెయిల్ చేశాడు ఓ విద్యార్థి. ఆ తర్వాత నాలుగు రోజుల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు శనివారం నాడు మీడియా సమావేశంలో వెల్లడించారు.
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పరాజుపల్లెకు చెందిన జగన్ రెడ్డి హైదరాబాదులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతడు ఈ నెల 3వ తేదీన మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి ఫోన్ చేసి బెదిరించాడు.

మీ అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు నా వద్ద ఉన్నాయని, రూ.30వేలు ఇస్తే వాటిని మీకు అందిస్తానని, లేదంటే మీ బండారం బయటపెడతానని అతను ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో మంత్రి పోలీసులకు సమాచారం అందించాడు.
ఆయన చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ నెంబర్‌ను తీసుకొని విచారణ జరిపారు. జగన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించారు. శనివారం నాడు హైదరాబాదులో అతనిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి తరలించారు.












Click it and Unblock the Notifications