అద్భుతం: ప్రమాదంతో మహిళకు తిరిగొచ్చిన కంటిచూపు

హ్యూస్టన్‌: అమెరికాలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే శరీరంలో ఏవో అవయవాలకు దెబ్బ తగులుతుంది. అయితే, అమెరికాకు చెందిన ఒక మహిళ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విదరుద్ధంగా జరిగింది. ఆమె శరీరంలో దెబ్బతిన్న ఓ అవయవం బాగుపడింది.

ఫ్లోరిడాకు చెందిన మేరీ ఆన్‌ ఫ్రాంకోకు 1993లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుపాముకు గాయమైంది. దీంతో ఆమె కంటి చూపును కోల్పోయింది. ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టులో మళ్లీ ఆమెకు ప్రమాదం జరిగింది.

Fall restores woman’s sight after 20 years

ఇంట్లో నడుస్తూ తుళ్లి పడిపోయింది. తల వెనకభాగంలో దెబ్బ తగిలింది. మెడకు పట్టీ అమర్చుకోవాల్సి వచ్చింది. దీనిపై కొన్నివారాల కిందట వైద్యులు ఆమె మెడకు శస్త్రచికిత్స చేశారు.

మత్తు ప్రభావం నుంచి బయటపడ్డాక.. తనకు కంటి చూపు తిరిగొచ్చినట్లు ఆమె గుర్తించింది. ఆమెకు చికిత్స నిర్వహించిన నాడీ శస్త్రచికిత్స నిపుణుడు జాన్‌ అఫ్షార్‌ దీనిపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. చూపు తిరిగొస్తుందని తాను అనుకోలేదని చెప్పారు. ఇదొక అద్భుతమని, దీనికి వైద్యపరమైన వివరణలేదని జాన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+