Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

67 ఏళ్ళ వయస్సులో గర్భం దాల్చింది, ఎందుకలా చేసిందంటే

గ్రీస్ :67 ఏళ్ళ వయస్సులో ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వయస్సులో ఆమె గర్భం దాల్చిన సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది. కోర్టు ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ ఆమె ఈ బిడ్డకు జన్మనిచ్చింది. విషాదమేమిటంటే ఆమె ఎవరికోసమైతే ఈ బిడ్డకు జన్మనిచ్చిందో ఆమె లేకుండాపోయింది. దీంతో ఆవేదన చెందుతోంది. గ్రీస్ దేశంలో 67 ఏళ్ళ బామ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

67 ఏళ్ళ వయస్సులో గ్రీస్ దేశానికి చెందిన అనస్టాసియా ఒంటు అనే వృద్దురాలు ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె గ్రీస్ లోని లారిసా పట్టణానికి చెందినవారు. ఈ లేటు వయస్సులో ఆమె గర్భం ఎందుకు దాల్చిందో చెబితే ఆశ్చర్యపోతారు. అయితే తనకు ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడ ఆమె గర్భం దాల్చింది.

అయితే ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఎవరికోసమైతే బిడ్డకు జన్మినిచ్చిందో ఆ బిడ్డను చూసుకొనేవారే లేకపోయారని ఆమె ఆవేదన చెందుతోంది. అనస్ఠాసియా ఒంటు కు కాన్ స్టాంటినా అనే కూతురు ఉంది. ఆమెకు 43 ఏళ్ళ వయస్సులో క్యాన్సర్ కారణంగా 2009 లోచనిపోయింది.

Greek grandmother becomes world's oldest surrogate mother

కాన్ స్టాంటినా కు పిల్లలు పుట్టలేదు. ఆమెకు ఏడుసార్లు గర్భస్రావం అయింది. తాను బిడ్డలను కనలేకపోతున్నాననే భాద ఆమెను ఇబ్బందిపెట్టేది.అయితే క్యాన్సర్ కారణంగా ఆమె చనిపోయింది. అయితే తన కూతురు బిడ్డకు తాను తల్లిని అవుతానని ఆమె బిడ్డకు హమీ ఇచ్చింది. ఈ హమీని ఆమె నెరవేర్చింది.

ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడ ధైర్యం చేసి తన కూతురు కోసం బిడ్డను కన్నట్టుగా ఆమె చెబుతున్నారు. ఆమె ఏడు మాసాల గర్భవతిగా ఉన్న సమయంలో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఆమె కడుపులో నుండి ఆడపిల్లను తీశారు. పసిపాప, వృద్దురాలు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు.

అంతర్జాతీయ రికార్డుల ప్రకారంగా ఇంత లేటు వయస్సులో సరోగేట్ మదర్ గా ఎవరూ లేరని వైద్యులు చెబతున్నారు. ఇది ప్రత్యేకమైన కేసు కావడంతో కోర్టు అనుమతి తీసుకొన్నట్టు ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ ఫాంటోస్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+