తొలిసారి మేకప్ లేకుండా భార్యను చూసి...

దుబాయ్: పెళ్లయిన తర్వాత భార్యను తొలిసారి మేకప్ లేకుండా చూసిన ఓ వ్యక్తి ప్రతిస్పందనకు అదరూ ఆశ్చర్యపోతున్నారు. అలా చూసిన అతను ఆమెకు వెంటనే విడాకులు ఇచ్చాడు. మేకప్ లేకుండా ఉన్న తన భార్యను కనీసం గుర్తుపట్టలేక పోయానని చెప్పాడు.

పెళ్లికి ముందు భారీగా ముస్తాబు చేసి తనను మోసగించారని, ఆమె కంటి రెప్పలు కూడా కృత్రిమమే అని అతడు ఆరోపించాడు. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. పెళ్లి తర్వాత నూతన వధూవరులు షార్జాలోని అల్ ముంజార్ బీచ్‌లో ఈతకు వెళ్లారు. పెండ్లి కూతురు ఈత కొట్టి బయటకు వచ్చిన తర్వాత ఆమె ముఖంపై ఉన్న మేకప్ అంతా తుడుచిపెట్టుకుపోయింది.

Husband divorces his wife after seeing her without makeup for the first time

సహజంగా ఉన్న ఆమెను తొలుత గుర్తించడంలో తడబాటుకు గురయ్యానని, ఇందులో ఏదో మోసం జరిగిందని అర్థమైందని పెళ్లి కొడుకు తెలిపారు. విడాకుల అనంతరం తలెత్తిన మానసిక సమస్యలను పరిష్కరించాలని 28 ఏళ్ల మహిళ తన వద్దకు వచ్చిందని సైకాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ అజిజ్ అసఫ్ చెప్పారు.

పెళ్లి కొడుకుకు అసలు విషయాన్ని ఆమె చెప్పాలనుకున్నదని, అయితే అప్పటికే ఆలస్యమైందని ఆయన తెలిపారు. దాంపత్య జీవితం కొనసాగించడానికి అవకాశం లేకుండా వరుడు వెంటనే విడాకులు ఇచ్చాడని అసఫ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+