బంతి వేయకుండానే 5పరుగులు: జడేజా చేసిన పనికి టీమిండియాకు షాక్
ఇండోర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత ఆల్ రౌండర్ జడేజా చేసిన పనికి అతనికి జరిమానాతోపాటు టీమిండియాకు షాక్‌కు కూడా తగిలింది. ఎందుకంటే ఒక్క బంతి వేయకుండానే న్యూజిలాండ్ స్కోరు 5/0గా స్కోర్ బోర్డుపై కనిపించింది.
వివరాల్లోకి వెళితే.. టీమిండియా 557పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఓపెనర్లు మైదానంలోకి అడుగుపెట్టారు. కాగా, మార్టిన్ గుప్తిల్ తొలి బంతిని ఎదుర్కోకముందే స్కోరు బోర్డుపై 5/0 స్కోరు కనిపించింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎక్క్‌ట్రాలు ఏమైనా వేశారా? అంటే అదీ లేదు. ఎందుకంటే ఒక్క బంతి కూడా పడలేదు. అయితే, ఆ తర్వాత తెలిసింది దీనికంతటికీ రవీంద్ర జడేజానే కారణమని.

ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ఎన్నిసార్లు చెప్పిన్ పిచ్ మధ్యలోంచి పరుగులు తీయడంతో జడేజా మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానా విధించారు. అంతేగాక, తన జట్టు టీమిండియాకు జరిమానాగా న్యూజిలాండ్ జట్టుకు 5 పరుగులు ఇచ్చేశారు. దీంతో న్యూజిలాండ్ ఒక్క బంతి ఎదుర్కోకపోయినా 5 పరుగులు పొందింది.
కాగా, బౌలింగ్ చేసేటప్పుడు కూడా జడేజాకు పిచ్ మధ్యలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి అప్పీల్ చేయడం అలవాటు. ఇంతకుముందు కోల్‌కతా టెస్టులో కూడా అంపైర్ రాడ్ టకర్ దీనిపై ఒకటి రెండుసార్లు జడేజాను హెచ్చరించారు.
.@BCCI Ravindra Jadeja fined and also receives three demerit points https://t.co/jdsPdvHnhG #INDvNZ via @icc
— ICC Media (@ICCMediaComms) 9 October 2016
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications